
జనం న్యూస్, డిసెంబర్ 17, అచ్యుతాపురం:
మండలం లోని దోసూరు శివారు రావిపాలెంలో ధనుర్మాసం మేలుకొలుపులు ప్రారంభమయ్యాయి.
ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన మాసం.వైష్ణవ సాంప్రదాయంలో దీనికి అత్యంత విశిష్టత ఉందని ధర్మరక్షా సమితి ఎలమంచిలి సబ్ డివిజన్ సభ్యులు కొల్లి అప్పారావు అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ధనుర్మాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రత్యేకమైనదని, నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారని,గోదాదేవి ధనుర్మాసం అంతా స్వామిని కీర్తించి స్వామిని చేరిందని, శ్రీకృష్ణుని మరో రూపమే హరిదాసుడు సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే వీళ్ళు కనబడతారని,హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని అన్నారు. పల్లకితో ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ ఆ భగవంతుని మేలుకొలుపుతూ ప్రార్ధించాలని,హరిదాసు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయాలని మన ఆచారాలను మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని అన్నారు.