
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 డిసెంబర్
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సత్య ప్రణవ్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న గాంధీనగర్, గుల్షన్ నగర్, సలాం నగర్, కాలనీ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ సత్య ప్రణవ్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి వారికి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారుబుధవారం సత్య ప్రణవ్ జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి సుభాష్ రావు మెడికల్ సెలవులో వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో నియమించినట్లు తెలిసింది. ఇటీవలే గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మున్సిపల్ కమిషనర్ గా పదవి పొందినటువంటి సత్య ప్రణవ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు. ఈ సందర్భంగా సత్య ప్రణవ్ మాట్లాడుతూ.. జహీరాబాద్ పట్టణంలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలతో కలసి శాయశక్తుల కృషి చేస్తామన్నారు. ఎవరికైనా ఏ విధమైన సమస్యలను నేరుగా కార్యాలయానికి తమకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.