కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ బడ్జెట్
పేద,మధ్యతరగతి ప్రజలు మెచ్చిన బడ్జెట్ అని బీజేపీ మండల అధ్యక్షులు వీరబాబు అన్నారు.మంగళవారం మండల కేంద్రం లోని పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో అధికారం లోకి వచ్చి 14 నెలలు అవుతున్న ఎన్నికలలో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.ఈ సమావేశం లో యువ నాయకులు రౌతు కళ్యాణ్, మండల నాయకులు పాపయ్య, బిక్షం రెడ్డి, బూతు అధ్యక్షులు మహేష్,వీరబాబు, నరేష్,తదితరులు పాల్గొన్నారు.