
జనం న్యూస్ డిసెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహార్ వాజ్పేయి సుపరిపాలన, దార్శనిక అభివృద్ధి విధానాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తున్న సమ్మిళిత అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు చేపట్టిన అటల్, మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా ఈ నెల 20వ తేదీ (శనివారం) సాయంత్రం అనకాపల్లి ఫ్లైఓవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి గారి కాంక్ష విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఈ సందర్భంగా వాజ్పేయి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మరియు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా బీజేపీ నేతలు కోరారు.