
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు డిసెంబర్ 20న జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు 9 నెలల శిక్షణ నిమిత్తం వెళ్ళుటకు హాజరుకావాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ డిసెంబర్ 18న ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ మాట్లాడుతూ - కానిస్టేబుళ్ళుగా ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 22 నుండి శిక్షణ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్ళుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్ధులు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద డిసెంబర్ 20న ఉదయం 8గంటలకు శిక్షణకు వెళ్ళుటకు లగేజితో హాజరుకావాలన్నారు. అభ్యర్ధులు తమతో పాటు
1) 5 పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలు
2) 2 స్టాంప్ సైజు కలర్ ఫోటోలు
3) ఒరిజినల్ సర్టిఫికెట్లు
4) రూ.100/- నాన్ జుడిషియల్ బాండు
5) కప్పుకోవడానికి 2 బ్లాంకెట్స్
6) రూ.10,000లు - తిరిగి ఇవ్వబడే కాషన్ డిపాజిట్, మెస్ చార్జీలు కొరకు తీసుకొని రావాలన్నారు.
హాజరయిన అభ్యర్ధులను 9నెలల శిక్షణ నిమిత్తం పురుష అభ్యర్ధులను డిటిసి, చిత్తూరుకు, మహిళా అభ్యర్ధులను పిటిసి, ఒంగోలుకు పంపుతామని జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్ధులు తమ వెంట విలువైన వస్తువులను తీసుకురాకూడదని, శిక్షణా కేంద్రానికి అభ్యర్ధుల వెంట బంధువులను అనుమతించరని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. గమనిక: మన జిల్లా నుండి ఇతర జిల్లాలకు ఎంపికైన కానిస్టేబులు అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ఎస్పీ కార్యాలయాల్లో హాజరవ్వాలి.