
జనం న్యూస్ 19 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి, ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం అనంతపురం, విజయనగరం లో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.