
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
సుషిత మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జోగులాంబ గద్వాల జిల్లా
జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో గల 50 చర్చిలు, అలంపూర్ నియోజకవర్గంలోని 50 చర్చిలకు అందంగా అలంకరించుటకు వాటికి సున్నం, డెకరేషన్ ఎలక్ట్రిక్ లైటింగ్ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహయం అందించనున్నదని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని నుషిత ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గల రిజిస్టర్ అయిన చర్చిలు కలిగిన వారు దరఖాస్తు చేసుకొనుటకు చర్చి కమిటీ యొక్క లెటర్ హెడ్,చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,చర్చి కమిటీ వారి బ్యాంక్ అకౌంట్,చర్చి యొక్క ఫోటోలతో వారి యొక్క దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయం రూమ్ నెంబర్ 08, మొదటి అంతస్తు, జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఈనెల 20 వరకు సమర్పించాలని ఆమె తెలిపారు.ఇతర వివరములకు సెల్ నెంబర్ 7013032567ను సంప్రదించాలని తెలిపారు.