
జనం న్యూస్ 19 డిసెంబర్ 2025
ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు జెడ్ హెచ్ డి సి సెకండ్ కాలనీ లో సాల్వ నరసింహులు పొలం లో అంతర పంటల సాగు అవగాహన కల్పించుటకై ప్రధాన పంట సపోటా అంతర పంట లో భాగంగా నవధాన్యాలు 32 రకాల విత్తనాలు భూమిలో చల్లినచో భూమి బాగా గుల్లబారుతుంది ప్రధాన పంటకు మొక్కకు బలపరుస్తుంది ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా పెట్టుబడి తగ్గడమే కాక ప్రజలు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని మండల వ్యవసాయ అధికారి బి మల్లిక తెలిపారు. రైతులందరు ఏక పంట వద్దు అంతర పంటలు ముద్దు మినుము,అలసంద,నువ్వులు,మొక్కజొన్న,సజ్జ,రాగులు మొదలైన పంటలు వేసుకోవాలని రైతులకు సలహా ఇచ్చి పూర్తి బాధ్యత నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్ ఏ హరి కృష్ణ, వి ఏ ఏ మధు ఆర్ ఎస్ కె సిబ్బంది నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది రైతులు గజేంద్ర,నరసింహులు,జయమ్మ పాల్గొన్నారు.