
జనo న్యూస్; డిసెంబర్ 19 శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్లో గత ఐదు రోజులుగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని వివేకానంద యోగా సొసైటీ, సిద్దిపేట వారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ యోగా శిబిరంలో ఆరోగ్య పరిరక్షణ, మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెంపొందించుకోవడం లక్ష్యంగా వివిధ యోగా ఆసనాలు, శ్వాస నియంత్రణ పద్ధతులు (ప్రాణాయామం), ధ్యానం గురించి సాధనాత్మకంగా శిక్షణ అందించారు. స్థానికులు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.యోగ సాధన ద్వారా రోజువారీ జీవనంలో ఒత్తిడి తగ్గి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.