
జుక్కల్ డిసెంబర్ 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలో బి.ఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశం గురువారము జుక్కల్ మండల కేంద్రంలో నిర్వహించగా జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొన్నారు ఈ సమావేశం ఏర్పడి బొల్లి గంగాధర్ ను బి ఆర్ఎస్ మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తమపై నమ్మకంతో బి ఆర్ఎస్ మండల అధ్యక్షునిగా నియమించినందుకు తాను గ్రామస్థాయి నుండి బి ఆర్ఎస్ పార్టీ ఇంకా బలోపేతానికి కృషి చేయడమే కాకుండా ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా పోరాటం చేయడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు జుక్కల్ మండల్ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వంతో తమ పోరాటము కొనసాగిస్తానని ఈ సందర్భంగా జుక్కల్ మండల కార్యకర్తలకు చెప్పారు