
కొత్తగూడెం డిసెంబర్ 20 జనం న్యూస్ ఆర్ సి
కుసుమ ధర్మన్న కళాపీఠం వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన "చిత్ర కవిత" పోటీలలో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శింపజేసినందుకు కొత్తగూడెం రామవరం ప్రాంతాన్నివాసి అభ్యుదయ కవి తూముల శ్రీనివాస్ కి ఉత్తమ కవితా పురస్కారం లభించినది కవి సమ్మేళనం లో 60 మంది కవులు పాల్గొనగా తాను రచించిన కవితకు ఉత్తమ కవిత పురస్కారం దక్కినందుకు కుసుమ ధర్మన్న కళా పీఠం నిర్వాహకవర్గానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసినారు రామరాజ్యం స్థాపిద్దాం! రైతన్నను రక్షించుకుందాం! తూముల శ్రీనివాస్ వచన కవిత పచ్చడి మెతుకులె పరమాన్నంగా భావించి పంటపొలాలలోకడుపాకలితీర్చుకుంటున్నరైతన్నలు పట్టుపరుపులేఅదృష్టంగా భావిస్తూ డైనింగ్ టేబుల్ పై
దర్జాగా మద్యంసేవిస్తూ విందుఆరగిస్తున్నవిలాస వంతులు కోట్లజనంఆకలితీర్చడానికి తాము అర్ధాకలితో హలంపట్టి పొలం దున్ని సేద్యం చేస్తు గట్టుపైన గంజి మెతుకులతోఆకలి తీర్చుకుంటున్న రైతు కూలీలు
కోట్లు గడించి అన్నం మెతుకులవిలువలు తెలియక పిజ్జా బర్గర్ మసాలా దట్టించిన చికెన్ మటన్
బిర్యానిబక్షిస్తున్న విలాసవంతులు పెట్టుబడిదారి చేతుల్లో రైతన్నబందీఅయి పోతున్నాడు
పండించిన పంటకు గిట్టుబాటు లేక ఉరితాడును ఆశ్రయిస్తున్నాడు రాజ్యం నల్ల చట్టాలతో రైతన్ననునలిపివేస్తు న్నది బువ్వను పండించే రైతన్నకు బువ్వ లేకుండా చేస్తున్నది
కార్పొరేట్ వ్యవస్థలో పంట పొలాలలో నింగినంటే బహుళ అంతస్తుల రియల్
ఎస్టేట్ దందా దినదినం పెరిగిపోతున్నది చెమటచుక్కచిందించని పెట్టుబడిదారీవ్యవస్థ
కోటానుకోట్లుగడిస్తున్నది చెమటదారలుచిందించి చేసేద్యం చేసే రైతన్నలు ధన స్వాములకబంధ హస్తాల్లో రైతు బ్రతుకు చిక్కిశల్యమైనలిగిపో పోతున్నది రైతునురక్షించుకుందాం! రామరాజ్యానికి మార్గం చూపుదాం!!
తూముల శ్రీనివాస్ కొత్తగూడెం 9397025027