
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) సిద్దిపేట జిల్లా:-
అక్బర్పేట–భూంపల్లి
మండలంలోని భూంపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారిని భూంపల్లి గ్రామ ముస్లిం కులస్తులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన భూంపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామ అభివృద్ధి, సామాజిక ఐక్యతకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముస్లిం కులస్తులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.