
జనం న్యూస్ డిసెంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గంది నానాజీ కాట్రేనికోన, :
కాట్రేనికోన గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మ వారికి మార్గశిర మాసం ఐదవ శుక్రవారం సందర్భంగా పూల మాలలతో విశేషాలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలుత విగ్నేశ్వరుని పూజ, అమ్మవారికి అభిషేకం మరియు శ్రీ సూక్త విధానంగా సహస్రనామ కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నీరాజనం మంత్ర పుష్పాలు, వేద స్వస్తి జరిపారు. ఈ సందర్భంగా మహిళలచే సామూ హికంగా లలితా సహస్ర పారాయణ చేశారు. అలాగే ఆలయ ఆవరణలో గల వినాయ కుడు, షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆణివిళ్ళ శేషసాయి,బాలా శ్రీనివాసు,గ్రంధి నాగబాబు ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగిందన్నారు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి జరిగిన పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆణివిళ్ళ రామకృష్ణ పరమహంస, గ్రంధి రాంప్రసాద్,ఆణివిళ్ళ పవన్, వేదుల శ్రీను,ఆకొండి శ్రీకాంత్, తాతపూడి పండు, సంసాని పాండురంగా రావు, విత్తనాల నరసింహారావు,సానబోయిన సూరిబాబు, సంసాని వరప్రసాద్, చెరుకు బాపిరాజు, సంసాని రాంబాబు, తదితరులున్నారు.

