
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22
తర్లుపాడు, డిసెంబర్ 21: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం తర్లుపాడు మండలంలో ఆదివారం విజయవంతంగా ప్రారంభమైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు.తర్లుపాడు మండల కేంద్రంలో చిన్నారుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్ సెంటర్ మరియు ఇతర ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ బూత్ల వద్ద ఉదయం నుండే తల్లిదండ్రులు తమ పిల్లలతో తరలివచ్చారు. 'రెండు చుక్కల మందు - జీవితానికి రక్షణ' అనే నినాదంతో సిబ్బంది చిన్నారులకు చుక్కలువేశారు.మండలంలోనిఐదేళ్లలోపుచిన్నారులందరికీ 100% టీకా వేయడం.వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.ఆదివారం కేంద్రాలకు రాలేని చిన్నారుల కోసం రేపు, ఎల్లుండి (సోమ, మంగళవారాల్లో) సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు.తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు స్థానిక నాయకులు ఈ సందర్భంగా కోరారు.