
బిచ్కుంద డిసెంబర్ 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులను రాజుల హెడ్మాస్టర్ రమాబాయి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా హెడ్మాస్టర్ రమాబాయి మొదట సర్పంచ్ గా జై కుమార్ ఉప సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ గా వార్డ్ సభ్యులను ప్రమాణస్వీకారం చేయించారు,అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జై కుమార్ ఉప సర్పంచ్ శిల్ప అజయ్ పటేల్ వార్డ్ సభ్యులను గ్రామ పెద్దలు అభిమానులు పంచాయతీ సెక్రెటరీ శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ జై కుమార్ పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అండ గ్రామ పెద్దల ప్రజల సహకారంతో గెలిపించినందుకు తనపై ఉంచిన నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా అందరి సహకారంతో గ్రామ అభివృద్ధి చేస్తా అన్నారు.
