
జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
విషయం : నల్లగొండ జిల్లా, చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యారిని రాచాల శివాని ఆత్మహత్యకు పాల్పడే లా ప్రేరేపించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొనుట గురించి…ఆర్యా !మేము అనగా జోగులాంబ గద్వాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యులమైన మేము తమరితో చేయు మనవి ఏమనగా .
నల్గొండ జిల్లా చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్ లో మూడురోజుల క్రితం, మేడపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో తీవ్రగాయాల పాలై ఐకాన్ ఆసుపత్రి నల్గొండ లో చికిత్స పొందుతూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కావున తమరు మాయందు దయ ఉంచి , సదరు బాలిక ఆత్మహత్య యత్నానికి కారకులైన వారిని గుర్తించి , చట్టపరమైన చర్యలు తీసుకోనెలా ప్రభుత్వానికీ నివేదించ ప్రార్థన.ఇట్లు.తెలంగాణ సగర సంఘం, జోగులాంబ గద్వాల జిల్లా.
యు.తిమ్మప్ప సగర అధ్యక్షులు,