జనం న్యూస్ //ఫిబ్రవరి //4//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట పట్టణంలోని ఎండి ఆరిఫ్ ఉద్దీన్ భూమి కబ్జా చేశారని, అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొగిలి లింగారెడ్డి సన్నాఫ్ మల్లారెడ్డి వారి నుండి తేదీ 6/ 12 /2023 రోజున సర్వేనెంబర్ 464 లోని ఫ్లాట్ నంబర్ నాలుగుని కొనుగోలు చేసమన్నారు.ఇ భూమిని 4776 /2023 తన భార్య అయిన ఉమ్మే రూమాన్ డాటర్ ఆఫ్ నాసరుద్దీన్, పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అని తెలిపారు.తనకు ఉన్న భూమి (ఫ్లాట్) వరకు హద్దులు పాతుకున్నాము అని వివరించారు. కానీ కొంతమంది ముఠాగా ఏర్పడి కాటిపల్లి రాజు, కాటిపల్లి సంధ్య మరియు కాటిపల్లి లక్ష్మి, అనే వీరు ఆ భూమికి నకిలీ పేపర్లు తయారు చేసి అక్రమంగా, నా భూమి లోకి చొరబడి, అక్రమార్కులైన, భూ కబ్జాదారు లు,ఆ భూమిని షేక్ షబీర్ అలీ మరియు అంబాల రాజు లా సహకారంతో భూమిని కబ్జా చేయడానికి చూస్తున్నారని వివరించారు.03/02/2025 రోజునా సుమారు ఉదయం 9 గంటల ప్రాంతంలో తాటిపల్లి రాజు సంధ్య లక్ష్మి షేక్ షబ్బీర్ అలీ మరియు అంబాల రాజు కలిసి మా ఫ్లాట్లోకి అక్రమంగా ప్రవేశించి ఫ్లాట్ యొక్క హద్దురాలు పీకేసి, మొరం కొట్టించి టెంటు వేసుకున్నారన్నారు అని తెలిపా రు. నేను నా భూమి కాడికి వెళ్లి, ఎవరు మీరు, ఈ భూమి మాది అని అడగగా వారు మమ్మల్ని బూతులు తిడుతూ చంపుతానని బెదిరించారు అని అన్నారు . అక్రమంగా చొరబడింది కాక నా భూమిలో టెంట్ వేసి,ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమి మాదే అని మీడియా ముందు మమ్మల్ని బదనం చేస్తున్నారన్నారు . పట్టాదారులమైన,మమ్మల్ని దొంగలుగా చూపిస్తున్నారన్నారు. వారి వల్ల మాకు ప్రాణభయం ఉన్నందున,మాకు తగు న్యాయం జరగాలని అని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో , భూ కబ్జాదారులు మరియు నన్ను చంపుతా అని బెదిరించిన వారిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది అని మాట్లాడారు, జమ్మికుంట పట్టణ సిఐ , ని వివరాలు అడగగా, ఎండి ఆరిఫ్ ఉద్దీన్ అయినటువంటి, అతని భూమిని కొంతమంది కబ్జ చేశారని, అడిగితే చంపుతాను నీ బెదిరించారాని, ఫిర్యాదు ఇవ్వడం జరిగింది,తాటిపల్లి రాజు,తాటిపల్లి లక్ష్మి కాటిపల్లి సంధ్య షేక్ షబ్బీర్ అలీ, అంబాల రాజు,అను వారి మీద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు.