
జనం న్యూస్ 22 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గొప్ప గొప్ప ఆలోచనలు విద్యార్థి దశలోనే రావాలి.జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్.జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025- 26 కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులను చదువు పట్ల మక్కువ కలిగేటట్లు చూడాలి.ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.ప్రతిరోజు నూతన ఆలోచనతో ఆలోచించాలి. డీఈవో విజయలక్ష్మి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీనివాస రామానుజన్ ప్రాంగణం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2025- 26 లో భాగంగా జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రాజెక్ట్‌ల ప్రదర్శన లో ఏర్పాటుచేసిన వివిధ రకాల ప్రదర్శనను తిలకించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సంతోష్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిఈఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటిస్తూ శ్రీనివాస రామానుజన్ చాలా గణితంలో జ్ఞానం కలవాడు అని ఆయన స్ఫూర్తిని మనందరికీ కూడా ఉండాలి అంటూ విద్యార్థులకు సూచనలు చేశారు. నూతన ఆవిష్కరణలు కొత్త కొత్త మార్పులు విద్యార్థులకు మంచి అనుభూతిని ఇస్తుందని తెలియజేశారు.కొత్త కొత్త ఆవిష్కరణల వల్ల పిల్లలు చాలా చురుకుగా ఉంటారని తెలియజేశారు. అలాగే భవిష్యత్ తరాలకు నాంది పలకడంలో కీలకపాత్ర పోషిస్తారని కొనియాడారు.
ప్రతి విద్యార్థిని ప్రోత్సహించి శాస్త్రీయ ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్, పాఠశాల అధ్యాపకులు లోకేష్, నవీన్, ఏనాథ్, చైతన్య,సంతోషి, చందన, ప్రేమ కుమారి, వనజ వివిధ శాఖల అధికారులు విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.