
జనంన్యూస్ డిసెంబర్ 22( కొత్తగూడెం నియోజకవర్గం ) బాబు క్యాంప్
గ్రామపంచాయతీలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, ఎన్నో అవరోధాలు ఎదురైనా ధైర్యంగా నిలబడి వార్డ్ మెంబర్గా గెలుపొందిన అప్రిన్ మహ్మద్ గారికి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ గారికి, మిగిలిన వార్డ్ మెంబర్లకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పారదర్శకమైన, మంచి పరిపాలన అందించాలని కోరారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారం ఉంటుందని, అందరూ కలిసి బాబు క్యాంప్ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.