
జనం న్యూస్ డిసెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికోన
గ్రామానికి చెందిన అన్నా చెల్లెలు అయిన ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రికి వాస్తు,జ్యోతిషం, సాహితీ, సామాజిక సేవలకు గాను మరియు ఆకొండి వారి ఆడపడుచు అయిన డా. ఆణివిళ్ళ శ్రీవాణి సుబ్బలక్ష్మికి తెలుగులో ప్రాచీన సాహిత్య పరిశోధనలో ఇటీవల డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా రితికా ఫౌడేషన్ వారు ద్వారకా తిరుమలలో దుశ్శాలువతో ఘనంగా సత్కరించి బెస్ట్ నంది పురస్కారం అందజేసారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు గ్రంధి నానాజీ, బదరీ,సురేష్, తాతపూడి బుల్లి, ఆకొండి ఉమామహేష్, సుంకర పవిత్ర,బుజ్జి,చల్లా గోపి, రాధాకృష్ణ, తాతపూడి సుబ్బారావు, కృష్ణ, ఆణివిళ్ళ ఉషా కిరణ్, యోగీరామ్, సూర్య కామేశ్వర రావు, ఫణికాంత్ వి.హనుమాన్, ఎ.సూరిబాబు,శివ మరియు పత్రికా విలేఖరులు, మిత్రులు, బంధువులు పలువురు అభినందించారు.
