
ప్రమాణ స్వీకారం సందర్భం గా గ్రామస్తులకు తీపి కబురు అందించిన కొత్త పాలక వర్గం…
గ్రామం లో మిషన్ భగీరథ వల్ల దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం…
జనం న్యూస్ డిసెంబర్ 23, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి మండలం : మండలం లో గల వెల్లుల్ల గ్రామ ప్రజలు 5 సం.ల పాటు నల్లా పన్నులు (బిల్లులు) చెల్లించనవసరం లేదని గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు సోమవారం వెల్లుల్ల గ్రామ పాలక వర్గ సభ్యులైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రామ పంచాయతీ కార్యాలయం లో అట్టహాసం గా జరిగింది.ప్రమాణ స్వీకార అనంతరం గ్రామ కార్యదర్శి , కార్యాలయ సిబ్బంది తో పాటు పలువురు స్థానిక నాయకులు పాలక వర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భం గా తొలి సారి సమావేశమైన పాలక వర్గం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది మునుపెన్నడు లేని విధంగా గ్రామం లో నల్లాలు వినియోగించుకునే గృహ యాజమాన్యాలు ఇక ముందు రాబోయే 5 సం వరకు నల్లా బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదని కేవలం ఆస్తి (ప్రాపర్టీ) పన్ను మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని గ్రామస్తులకు సర్పంచ్ తీపి కబురు అందించారు. అంతే కాకుండా మిషన్ భగీరథ పనుల వల్ల గ్రామం లో దెబ్బతిన్న రోడ్ లకు పూర్తి స్థాయి లో పునరుద్ధరణ చర్యలు చేపట్టి గతం లో మాదిరిగా రోడ్ల ను పునర్నిర్మాణం చేయనున్నట్లు ఇందుకు పాలక వర్గం తీర్మానం చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భం గా సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ గ్రామ ప్రజలు నా మీద మా కుటుంబం మీద ఉన్న నమ్మకం గౌరవం తో మరో సారి నన్ను సర్పంచ్ గా గెలిపించి ఆదరించారని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తుల రుణం తీర్చుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటు లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఒక సైనికుడిలా పని చేస్తానని పదవి అనునది సేవ చేయడానికి ఒక గౌరవం మాత్రమేనని గ్రామం లోని పార్టీలకు అతీతం గా అందరిని కలుపుకొని ముందుకు వెళతానని ఎన్నికలపుడు మాత్రమే పార్టీలు అని, అనంతరం అందరితో కలిసి పని చేయడానికి ఎప్పుడూ అందుబాటు లో ఉండనున్నట్లు ఈ సందర్భం గా ఆయన తెలిపారు.