
చిలిప్ చెడ్ మండల విద్యాధికారి విఠల్
జనం న్యూస్ డిసెంబర్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి కాంప్లెక్స్ సమావేశం చండూర్ యందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యలో నాణ్యత, ప్రమాణాలు పెంపొందించాలని జాతీయస్థాయిలో ఫిబ్రవరిలో నిర్వహించే ఎఫ్ ఎల్ ఎస్ సర్వే కి 3వ తరగతి విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. మండలంలో ఉపాధ్యాయుల కృషి వల్ల విద్యార్థుల హాజరు 60% నుండి 80%కి గణనీయంగా పెరిగిందని,అది 100 శాతానికి పెంచి ఆదర్శంగా ఉండాలన్నారు. పదవ తరగతి పరీక్షల్లో మండలంలోని అన్ని పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తెలిపారు.జిల్లా ఎఫ్ ఎల్ ఎన్ అబ్జర్వర్ సాయి కృష్ణ సమావేశాన్ని సందర్శించి ఎఫ్ ఎల్ ఎన్ రెడీ స్కూల్స్ మరియు రెమిడియేషన్ గురించి సలహాలు సూచనలు ఇచ్చారు. దీనిలో చండూరు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ చిలిపి చెడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధనమూర్తి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు