
విట్టల్ వాడి గ్రామంలో విజయోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే
జుక్కల్ డిసెంబర్ 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కొడపగల్ మండలం విట్టల్వాడి గ్రామం లో ఇటీవల జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించిన సందర్భంగా గ్రామంలో విజయోత్సవ సభ కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే హాజరుకాగా, విట్టల్వాడి గ్రామ ప్రజలు ఆయనకు పుష్పగుచ్ఛాలు, నినాదాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడిన హన్మంత్ షిండే ,
ప్రజల ఆశీర్వాదంతో బి ఆర్ ఎస్ పార్టీకి వచ్చిన ఈ ఘన విజయానికి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ పనిచేయాలని సూచించారు.కేసీఆర్ నాయకత్వంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, అదే అభివృద్ధి బాటలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విట్టల్వాడి గ్రామంలో బి ఆర్ ఎస్ జెండా గర్వంగా ఎగిరేలా చేసిన ప్రజల తీర్పు – ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచింది.ఈ కార్యక్రమం లో కొడపగల్ మండలం మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రావణ్, హన్మంత్ రెడ్డి, రియస్, మహ్మద్, సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ లు కిషన్ పవర్, శంకర్ మహారాజ్ BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


