
జనం న్యూస్, డిసెంబర్ 23,అచ్యుతాపురం:
రెండు గ్రామ సచివాలయాలుగా ఉన్న పూడిమడక గ్రామ పంచాయతీను,పరిపాలన సౌకర్యం కోసం పూడిమడక పంచాయతీను పూడిమడక,కడపాలెం, పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ
ఈ రోజు ఎంపీడీఓ మరియు పూడిమడక గ్రామ పంచాయతీ సెక్రటరీకి పూడిమడక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు వినతిపత్రం అందించారు. అనకాపల్లి జిల్లా,యలమంచిలి నియోజకవర్గం,అచ్యుతాపురం మండలం,పూడిమడక గ్రామం,ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామం,20 వేల జనాభా కల్గిన పూడిమడక గ్రామ పంచాయతీలో కడపాలెం, కొండపాలెం,ఎస్సీ కాలనీ,పల్లి పేట,పెద్దూరు,జాలరిపాలెం గ్రామాలతో పూడిమడక పంచాయతీగా ఏర్పాటైనది.పూడిమడక పంచాయతీలో 9వేలు పైగా ఓటర్లు కలరు అని,పూడిమడక పంచాయతీను, పరిపాలన సౌలభ్యం కోసం,పూడిమడక పంచాయతీ నుంచి కడపాలెం గ్రామంను వేరుచేసి కడపాలెం గ్రామ పంచాయతీగా విభజన చేసి కొత్త పంచాయతీగా కడపాలెం గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ సంతకాలు చేసిన,తీర్మాన కాఫీను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి కడపాలెం గ్రామంను కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో చోడిపల్లి అప్పారావు,వాసుపల్లి శ్రీనివాస్ రావు,ఉమ్మిడి అప్పారావు,పొన్నమళ్ళ కొండబాబు,ఎరిపల్లి కాసుబాబు,ఈరిగిల సంతోష్, కొనపల్లి అప్పలరాజు,గనగళ్ల దేముడు,ఉమ్మిడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
