
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 23
ఆధ్వర్యంలో బంజారా సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన బంజారా ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని నాయకులు సూచించారు. బంజారా సమాజ అభ్యున్నతి కోసం ప్రజాప్రతినిధులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీఈఎస్ఎస్ నాయకులు, బంజారా సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.