
జన న్యూస్ డిసెంబర్(23) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట్ల గ్రామం ఉప సర్పంచ్ తాళ్ల పెళ్లి అహల్య మంగళవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సర్పంచ్ లకు ఉన్న చెక్కు పవర్ రద్దు చేయడం హేయమైన చర్య అని అన్నారు. గత ప్రభుత్వం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కి జాయింట్ చెక్ పవర్ ఇచ్చి గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చెక్ పవర్ రద్దు చేయడం వెనుక ఎలాంటి మర్మం ఉన్నదో అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా బీసీలు ఉప సర్పంచ్ లుగా ఉన్నారని కావాలనే రేవంత్ రెడ్డి ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేశారని వెంటనే ఇట్టి నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.