
జనం న్యూస్ 24 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గుర్ల మండలం చింతపల్లిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రోజు తల్లి, కూతురు మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పలనరసమ్మ (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. తల్లిని చివరిచూపు చూసుకునేందుకు వచ్చిన కూతురు గౌరీ(38) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.