
జనం న్యూస్ డిసెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గుత్తెనదీవి ఉపమండలములోని జి. వేమవరం గ్రామంలో మద్దిం శెట్టి గంగారావు వారి రైస్ మిల్ ప్రాంగణంలో హిందూ బంధువులు కలిసి హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షులు చెరుకూరి కృష్ణరాజం రాజు మాట్లాడుతూ హైందవ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ద్వారా దేశానికి చాలా మంచి జరుగుతుందన్నారు. విశిష్ట అతిథి పూజ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ ప్రసంగిస్తూ హిందూ సనాతన ధర్మం ఎల్లకాలం ఉంటుందని, ఆధ్యాత్మిక భావాలను పిల్లలకు చిరుప్రాయం నుంచి అలవర్చాలని ,ఆటపాటలతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలని ఈ మేరకు తల్లిదండ్రులు అంతా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మనమంతా హిందువులు గానే జీవించాలని, హిందువులు గానే మరణించాలని, గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అని నినదించాలని తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రాంత కళాశాల విద్యార్థి ప్రముఖ్ బత్తల అశోక్ మాట్లాడుతూ కులాలు, ప్రాంతాలు రాజకీయాలకు అతీతంగా మనమంతా హిందువులం అనే భావనతో జీవించినప్పుడే ధర్మ పరిరక్షణ సాధ్యమన్నారు. దేవాలయ సంరక్షణ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ పంచ సూత్రాలు ప్రతి ఒక్కరు ఆచరించాలని దేశభక్తి, క్రమశిక్షణ, సంఘటితశక్తి ,సాంస్కృతిక జాతీయత, సామాజిక సమరసతలే బలమైన భారతానికి పునాదులు అని వివరించారు. మాతృమూర్తి కంతేటి సునీత రామలక్ష్మి తన ప్రసంగంలో పిల్లలకు మొదటి గురువు తల్లి అని, సనాతన ధర్మాన్ని కాపాడేది తల్లులే అని అన్నారు .చిన్నతనం నుండి దేశభక్తి ,సంస్కృతి సాంప్రదాయాలు నూరిపోసినప్పుడే సమాజం బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి కృష్ణరాజం రాజు ,సర్పంచులు నల్లా సుదర్శనరావు, లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ,సొసైటీ అధ్యక్షులు పెంట రవి ప్రసాద్, చిక్కాల శ్రీనివాస్ ,ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ పెన్మత్స గోపాల కృష్ణంరాజు, రెల్లు గంగాధరం, కొప్పురావూరి మల్లేశ్వర రావు కొండమూరి విజయబాబు, ముదునూరి సత్యనారాయణ రాజు, నీటి సంఘం అధ్యక్షులు చోటిశెట్టి నాగు, సాగి వెంకటపతి రాజు ,చోడిశెట్టి బ్రహ్మానందం, మద్దింశెట్టి పురుషోత్తం, భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు, ముదునూరి వెంకటేశ్వరరాజు చిక్కాల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.


