
జనం న్యూస్ 26 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
తన కుటుంబ సభ్యులు, అనధికార పీఏ సతీష్‌పై చేసిన ఆరోపణలు తప్పు అని పోలీసులే తేల్చారని మంత్రి సంధ్యారాణి పేర్నొన్నారు. బుధవారం సాలూరులో ఆమె మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే సత్తా లేక ఇలాంటి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ తప్పుడు ఆరోపణల వల్ల నెల రోజుల పాటు తమ కుటుంబం మనోవేధనకు గురైందని చెప్పారు. ఈ కేసుపై పూర్తిగా దర్యాప్తు చేసి సూత్రధారులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్పీకి సూచించానన్నారు.