
పీ.ఏ.పల్లి,గుడిపల్లి మండలం లోని క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు యేసుప్రభువు జన్మదిన సందర్భంగా చర్చి లో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన లు చేశారు.యేసుప్రభువు ప్రేమ స్వరూపి,దయనీయుడు, శాంత వాసి,కరుణ స్వభావి అని ఫాథర్ బోధించాడు. ప్రార్థనలు జరిగిన ప్రదేశాలు అంగడిపేట,అక్కంపల్లి, పీ.ఏ.పల్లి,అజ్మాపురం,ఘనపురం స్టేజ్,మేడారం,తిరుమలగిరి, ఎల్లపురం,వద్దిపట్ల,గుడిపల్లి,ఘనిపల్లి, పోల్కంపల్లి,భీమనపల్లి, గ్రామాలలో ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్స్,ఫాస్టర్లు, యవ్వనస్థలు,మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అంగడిపేట సర్పంచి రమవత్ చిరంజీవి నీ ఫాదర్ బైబిల్ బహుమానంగా ఇచ్చి సత్కరించారు.
