
హైదరాబాద్ జనం న్యూస్ 26 డిసెంబర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి స్వగృహంలో ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలన ప్రజా ఆమోదం పొందుతూ, అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లడంలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.