
జనం న్యూస్ ;26 డిసెంబర్ శుక్రవారం;సిద్దిపేట నియోజి కవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
జాతీయ రైతుల దినోత్సవం లో భాగంగా సిద్దిపేట బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో రైతులను ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ సందర్భంగా సిద్దిపేట శాఖ ఇంచార్జి బికె భవాని పలువురు రైతులను శాలువాలతో,పూల మాలలతో సత్కరించి ఈశ్వరీయ కానుక అందిస్తూ నిస్వార్ధంగా కష్టంతో కూడిన జీవితంతో ఎన్నో పంటలు పండిస్తూ వాటి ఫలాలు అందిస్తున్నారు.అయినా కొందరు వారికి ఆశించిన ఫలాలు అందక ఆవేదనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని కాబట్టి మానసికంగా వేదనకు గురవ్వకుండా రైతులలో ఆత్మ స్థైర్యం నింపేవిధంగా బ్రహ్మ కుమారీస్ యొక్క వింగ్ అయిన గ్రామీణ వికాస విభాగం సేవలు అందిస్తున్నారని ఆధ్యాత్మికంగా పరమాత్ముడి యొక్క స్మృతి/ధ్యానం చేస్తూ సత్ఫలితాలు పొందవచ్చునని తెలియచేశారు..ఈ సందర్భంగా రైతు సోదరులు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులు అనుసరించి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడిన వ్యవసాయం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిద్దన్నపేట సర్పంచ్ పురందర్,బాలయ్య,అమరేందర్ రెడ్డి ,తిరుపతి రెడ్డి, రాజమణి,సంస్థ ప్రతినిధి బికె స్వప్న,బికె ఓంకార్,బికె వెంకటేశం వై.రమేష్ తదితరులు పాల్గొన్నారు .