
జనం న్యూస్ డిసెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శుక్రవారం కాట్రేనికోన పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా విచ్చేసారు. ఎస్పీ కి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం స్టేషన్ పరిధిలోని సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఇప్పటివరకు కాట్రేనికోన పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులలో, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించారు. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం కొసం తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.నేరాల నియంత్రణ, కేసుల నమోదు, దర్యాప్తులలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ప్రజల్లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా నివారించాలన్నారు.కోర్టు మానిటరింగ్ విభాగాలు చేస్తున్న కృషిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కేసులలో శిక్షలు పడిన రేటు పెరగడం వ్యవస్థ యొక్క పటిష్టతకు నిదర్శనమని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అమలాపురం డి.ఎస్.పి టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ , కాట్రేనికోన ఎస్సై అవినాష్ , పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.