
జనంన్యూస్. 27. సిరికొండ. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని రావుట్ల గ్రామపంచాయతీ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అడవి సమీపంలో సాక్షాత్తు రాములవారు సీతమ్మ వెలిసినారు గ్రామ కమిటీ వారు అక్కడ ఆలయం నిర్మించడానికి గత మూడు నెలలో క్రితం భూమి పూజ చేసినారు. కోరికలు తీర్చే వాడయ్యా కోదండరామయ్య అంటూ భజన కార్యక్రమాల మధ్య భూమి పూజ జరిగినది. ఈరోజు మంచి దినాన్ని పురస్కరించుకొని భక్తుల కోరిక మేరకు అక్కడ అన్న సత్రం ఏర్పాటు చేసినారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని రావుట్ల గ్రామఅభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగినది.
