
జనం న్యూస్ డిసెంబర్ 27 ముమ్మిడివరం గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఈరోజు కాట్రేనికోన మండలం పల్లంకురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో రూ. 3.37 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ అధికారికంగా ప్రారంభించారు.ఈ సబ్‌స్టేషన్ ప్రారంభంతో పల్లంకురు గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందనుంది.సబ్‌స్టేషన్ ద్వారా కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు: నిరంతర విద్యుత్ సరఫరా: వోల్టేజ్ సమస్యలు తగ్గి, పవర్ కట్స్ గణనీయంగా తగ్గుతాయి.
వ్యవసాయానికి తోడు: మోటార్లు, సాగునీటి పంపులకు స్థిరమైన విద్యుత్ లభించి పంట దిగుబడులు పెరుగుతాయి పరిశ్రమలు & వాణిజ్యం: చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. గృహ అవసరాలు: గృహ వినియోగానికి సురక్షితమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా.
లోడ్ నిర్వహణ మెరుగుదల: ప్రాంతీయ లోడ్‌ను సమతుల్యం చేసి ట్రాన్స్ఫార్మర్ ఒత్తిడి తగ్గింపు.
అభివృద్ధికి బలం: గ్రామీణ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు సేవల విస్తరణకు దోహదం.
ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సబ్‌స్టేషన్ కాట్రేనికోన మండలంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలు మరింత బలపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు సిబ్బంది పాల్గొన్నారు.
