
జనం న్యూస్ డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని కొనసాగుతున్న పారిశుధ్య పనులను బీర్ పూర్ మండల పంచాయతీ అధికారి మధుసూదన్ శనివారం పరిశీలించారు. సర్పంచ్ ఏలమట్ల హరీష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను క్షేత్రస్థాయిలో సందర్శించిన ఎంపీఓ, వీధుల శుభ్రత మరియు మురుగు కాలువల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.గ్రామస్తుల ఆరోగ్య దృష్ట్యా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిరంతరం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
