
జనం న్యూస్ డిసెంబర్ 27 జగిత్యాల జిల్లా
బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సర్పంచ్ ఎలామట్ల హరీష్ ఆకస్మాత్తుగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, వంటల రుచిని మరియు పాఠశాలలోని వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోషకవిలువలతో కూడిన భోజనం అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జితేందర్, వార్డు సభ్యులు మందా సుభాష్, పూడూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
