
జుక్కల్ డిసెంబర్ 27 జనం న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకలలో భాగంగా, ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కేక్‌ను కట్ చేసి, వేడుకలకు హాజరైన క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు..ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమని అన్నారు.. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని, ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు..ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే చెప్పారు..ఏసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు..


