
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి కుటుంబసభ్యులకి, జిల్లాలోని యువతకు విమానాశ్రయంలో తగిన ఉపాధి కల్పించాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిని కోరారు. శనివారం కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వలన ప్రత్యక్ష, పరోక్షంగా దాదాపు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, యువతకు అవకాశం కల్పించాలన్నారు.