
జనం న్యూస్ 28 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. వార్షిక నేరాల సమీక్షా సమావేశాన్ని విజయనగరంలో నిర్వహించి మాట్లాడారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 35 శాతం మేర నేరాలు తగ్గాయన్నారు. వివిధ నేరాలకు పాల్పడుతున్న 473 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేశామన్నారు.