
జనం న్యూస్ డిసెంబర్ 68 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డా. బి. ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గా నియమితులు అయిన టీడీపీ సీనియర్ నాయకులు ముత్యాల బాబ్జి ని రాష్ట్ర బిజెపి యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ (జేపీ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం జేపీ మాట్లాడుతూ టీడీపీ పార్టీ పాటిష్టత కోసం ఎమ్మెల్యే బండారు సత్యనందం విజయం లో కూడా ఎంతో నిబద్దత తో పనిచేసిన బాబ్జి కి ఈ పదవి రావడం ఎంతో శుభపరిణామం అని జేపీ అన్నారు భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఆత్మ కమిటీ డైరెక్టర్ పాలాటి మాధవ స్వామి, బిజెపి మాజీ జిల్లా కార్యదర్శి గొలకోటి వెంకటేశ్వరరావు, rss కొత్తపేట కండ ప్రముక్ తోగరు ఆంజనేయులు, సబ్బవరపు సత్యనారాయణ, బల్ల రాజు, ఇళ్ల పళ్ళాంశెట్టి,మండల యువ మోర్చా అధ్యక్షులు వలపశెట్టి కిరణ్, అన్యం సత్యనారాయణ,గ్రంధి నవీన్,శివ రామకృష్ణ,కోటిపల్లి పల్లంరాజు, ముద్రగడ ఫణి తదితరులు పాల్గొన్నారు.
