
జన న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన గంధం పల్లం రాజు మరియు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ వారితో కలిసి ఈ రోజు విశాఖపట్నంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ వారిని మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో సత్కరించు కృతజ్ఞతలు తెలియచేసినారు… ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ& ఎస్టీ, విజిలెన్స్ &, మానిటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు సుధీర్, డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా టిడిపి బిసి సెల్ అధికార ప్రతినిధి విత్తనాల వెంకటరమణ, తాడి జానకిరామ్ కడలి వెంకట సత్యనారాయణ చప్పిడి సత్తిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
