
….మండల అధ్యక్షుడు గంగాధర్
బిచ్కుంద డిసెంబర్ 28 జనం న్యూస్
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రోజు (డిసెంబర్ 28) బిచ్కుంద మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం సీనియర్ నాయకులకు శాలువాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా , అధ్యక్షులు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు దేశ ప్రజల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసమే బలంగా, దేశ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలు, విలువలతో దేశానికి దిశానిర్దేశం చేస్తోందని అన్నారు.ఈ పవిత్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టీ జెండాను ఎగురవేసి, ఐక్యతతో ముందుకు సాగుతూ ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితోపాటు మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్, కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు మంచి యోగేష్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్పల్లి సంతోష్, శాఖాపూర్ సర్పంచ్ తుకారం, సాయిని అశోక్ సాయిని బసవరాజ్ ఉత్తం నాయక్ బండు పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

