
జనం న్యూస్ 29కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
జై నూర్ డిసెంబర్ 28. జై నూర్ మండలంలో ఆదివారం సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా సమతా సైనికులు ఆదిలాబాద్ జిల్లా నాయకులు పాపేస్ బాన్సువాడే మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన సమతా సైనిక సంస్థను 100 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంలో జనవరి 26న ఆదిలాబాద్ లో జరిగే గణతంత్ర దినోత్సవ సందర్భంగా సంతా సైనిక్దర్ 100 సంవత్సరాల పూర్తి చేయడంతో ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వాదులు అందరు కూడా హాజరు అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబాసాహెబ్ కామ్లే, సతీష్ కుమార్ నందన్ వరి, హనుమంతరావు, మాంగ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మవా లేదా, నాయకులు కమ్లి అశోక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు