
సోమిని గ్రామంలో కొమరం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సుగుణక్క
జనం న్యూస్ 29డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారం రాత్రి బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించగా,ప్రతి గ్రామంలో డప్పు వాయిద్యాలు, పూలవర్షం మధ్య సుగుణక్కకు ఘన స్వాగతం లభించింది. మర్తడి గ్రామంలో మండల అధ్యక్షుడు బూస శంకర్ ఆధ్వర్యంలో గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు ఆమెను శాలువాలతో సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు.బెజ్జూర్ మండలం సోమిని గ్రామంలోని ప్రధాన కూడలిలో గౌరవ కుమురంభీమ్ చిత్రపటానికి నివాళులర్పించిన సుగుణక్క,కుమురంభీమ్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పెగడపల్లి సరితతో పాటు వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.అనంతరం మొగవెల్లి గ్రామాన్ని సందర్శించిన సుగుణక్క ,అక్కడ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కొడప శంకర్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామపంచాయతీలో పర్యటించిన డీసీసీ అధ్యక్షురాలు,నూతన సర్పంచ్ కస్తూరి సునీత రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎల్లప్పుడూ తోడుంటుందని సుగుణక్క పేర్కొన్నారు.డీసీసీ కార్యాలయం,కుమురంభీమ్ ఆసిఫాబాద్
