
జనం న్యూస్ డిసెంబర్ 29, పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా
తెలంగాణలో ఇటీవల జరిగిన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్,లలో యువత సత్తా చాటారు. దీనిలో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నపూర్ గ్రామనికి చెందిన శివారెడ్డి పల్లి, రామేశ్వరమ్మ వెంకటేష్, అనే యువతి గ్రామంలో 5 వ వార్డు మెంబర్ గా పోటీ చేయ్యడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధర్య పడకుండా ధైర్యంగా బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీలో నిలిచి 17 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లను వేరు వేరుగా వారి నివాసాలలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం వార్డు మెంబర్ వెంకటేష్, ను చాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించిన మంత్రులు, అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ… వార్డు మెంబర్ గా ఎన్నిక కావడం తనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని,వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.