
జనం న్యూస్ డిసెంబర్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం భారతదేశానికి స్వాతంత్రం తీసుకు రావడం లో కాంగ్రెస్ పార్టీ క్రియాశీల పాత్ర పోషించిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎందరో మహానుభావులు ఐక్యంగా ఏర్పడి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి సేవలు మరువలేనివని అన్నారు సామ్యవాద భావజాలంతో ప్రజలకు విద్య ఆరోగ్యం ఉపాధి వంటి మౌళిక హక్కులను అందించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలు రైతుల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారేపల్లి రవీందర్ దుబాస్ కృష్ణమూర్తి నిమ్మల రమేష్ హైదర్ మారపల్లి వరద రాజు రఫీ మస్క కుమారస్వామి బడుగు అశోక్ చల్ల గోపాల్ రెడ్డి బూర రమేష్ సునీల్ రాజు తిరుపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు….