
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 29 డిసెంబర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు వచ్చినప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్క పని కూడా ముందుకు సాగలేదు ఏ ఒక్క పనికి కూడా నిధులు విడుదల చేయలేదు కనీసం రహదారుల నిర్మాణం కోసం జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో శాసనసభాపతి ముందుకు గళం వినిపించడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండడమే కాకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చాలని మాణిక్ రావు గారు కోరడం జరిగింది అలాగే జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు నూతనంగా ఏర్పడ్డ కోహిర్ మున్సిపాలిటీకి 100 కోట్లు నిధులు విడుదల చేసి మున్సిపాలిటీలకు కూడా డెవలప్మెంట్ చేయాలని జహీరాబాద్ నియోజకవర్గంలో స్మార్ట్ సిటీగా పేరుగాంచిన అభివృద్ధి మాత్రం స్మార్ట్ సిటీగా కాకుండా ప్రస్తుతం రహదారులు గుంతల సిటీగా ఏర్పడ్డాయి దీనిపై వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూ ఎమ్మెల్యే మాణిక్ రావు కోరడం జరిగింది