
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా
నందలూరు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుండి నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగు తుందని యస్.ఐ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్తపి, చెన్నయ్యగారి పల్లి లేబాక గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్ కు వచ్చే ప్రజలు సౌమ్యనాథ స్వామి ఆలయం వైపు దారిలో రాకుండాఈదరపల్లి ,దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్ లోకి వెళ్ళవలెను అని అన్నారు. శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన రావాలి అన్నారు. అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం వచ్చు భక్తులు నందలూరు షాది ఖానా వద్ద ఉన్న పార్కింగ్ లో వాహనాలు నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు కాలినడకన రావలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సౌమ్యనాథ స్వామి దర్శనం కోసం అధిక సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది, కావున నందలూరు మండల ప్రజలు, నాయకులు, మీడియా మిత్రులు మరియు భక్తాదులు పోలీస్ వారికి సహకరించ వలసిందిగా కోరుచున్నాము అని అన్నారు.