
డా,,బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సి.హెచ్.గున్నేపల్లి గ్రామంలో శ్రీ సీతా సమేత కళ్యాణరామ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభతో హిందూ సమ్మేళనం జరిగింది.
ఆర్ ఎస్ ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందూ సమాజమే స్వయంగా నిర్వహించుకున్న ఈ హిందూ సమ్మేళనంలో శ్రీ గొలకోటి వెంకట రెడ్డి అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథి అయిన పెనుగొండ వాసవీ పీఠం పీఠాధిపతులు పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ భావి తరాలకు సంస్కారాలు నేర్పాలి, సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేయాలి. సామాజిక సమరసత హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన అంశం, కావున మనం కుల, ప్రాంత, ఆర్ధిక తారతమ్యాలు విడిచి "గడపలోపలే కులం - గడప దాటితే హిందువులం" అనే నినాదాన్ని ముందుకు తీసుకెల్దామని పిలుపునిచ్చారు.ప్రధాన వక్తగా శ్రీ కె.లోవారెడ్డి మాట్లాడుతూ వందేళ్ళగా సంఘం అన్ని విభాగాల్లో అన్ని సంస్కరణ కోసం కృషి చేస్తుంది. రాబోయే రోజుల్లో సమాజంలో అత్యవసరమైన సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, హిందూ కుటుంబ వ్యవస్థ, స్వదేశీ, పౌర విధులు వంటి ఐదు విషయాల్లో పరివర్తన కోసం సమాజమంతా కృషి చెయ్యాలని హితవుపలికారు.చి,,గొలకోటి సంస్కృతి నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటుంది. చి,,లోహితాక్ష్, చి,,కృతివాస్, చి,,చార్వి, చి,,ఆధ్య లు భక్తి గీతాలాపన చేసారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ గాలిదేవర బుల్లి, శ్రీ నంద్యాల వెంకటరెడ్డి నాయుడు, శ్రీ పెన్మెత్స గోపావ కృష్ణం రాజు, శ్రీ నరహరిశెట్టి కిరణ్ కుమార్, మహిళా వక్తగా శ్రీమతి నల్లా ఆండాల్ దేవి, గ్రంధి నానాజీ, సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు,మరియు అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు.

